Anam Ramnarayanareddy: చంద్రబాబుకు షాకివ్వనున్న ఆనం రామనారాయణరెడ్డి... త్వరలో వైసీపీలోకి!
- 2014 ఎన్నికల తరువాత టీడీపీలో చేరిన ఆనం బ్రదర్స్
- వివేక మరణం తరువాత రాజకీయ భరోసా ఇవ్వని చంద్రబాబు
- వైసీపీలో ఆనం రామనారాయణరెడ్డి చేరతారని వ్యాఖ్యలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలు, వేరే పార్టీల్లో చేరిపోగా, నెల్లూరు జిల్లాలో పేరున్న ఆనం రామనారాయణరెడ్డి, ఆనం వివేకానందరెడ్డి సోదరులు తెలుగుదేశంలో చేరిన సంగతి తెలిసిందే. ఇటీవల తీవ్ర అనారొోగ్యం కారణంగా ఆనం వివేక మరణించగా, ఆనం రామనారాయణరెడ్డి వైఎస్ ఆర్ సీపీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
ఏ క్షణమైనా చంద్రబాబునాయుడికి షాకిచ్చి, వైఎస్ఆర్ సీపీలో ఆయన చేరిపోతారని తెలుస్తోంది. సోదరుడు బతికుంటే ఇద్దరమూ కలసి జగన్ తో కలిసుండేవాళ్లమని రామనారాయణరెడ్డి ఈ సందర్భంగా తన కార్యకర్తల వద్ద వ్యాఖ్యానించారు. ఆనం వివేక మరణించినప్పుడు పరామర్శకు వచ్చిన చంద్రబాబు, రామనారాయణ రాజకీయ భవిష్యత్తుపై ఎటువంటి భరోసాను ఇవ్వలేదని భావిస్తున్న ఆయనకు కార్యకర్తల నుంచి వైసీపీలో చేరాలని ఒత్తిడి వచ్చినట్టు తెలుస్తోంది. ఇక తన పార్టీ మార్పుపై ఆనం రామనారాయణ అధికారికంగా స్పందించాల్సివుంది.