Pawan Kalyan: పవన్ కల్యాణ్ ను గట్టిగా విమర్శించని నారా లోకేష్... కారణమిదే!

  • లోకేష్ ను టార్గెట్ చేసుకున్న పవన్
  • దీటుగా విమర్శలు చేయని లోకేష్
  • భవిష్యత్తులో పొత్తు అవకాశాలు ఉంటాయంటున్న విశ్లేషకులు
ఇటీవలి కాలంలో నారా లోకేష్ ను లక్ష్యం చేసుకుని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రమైన విమర్శలే చేసినప్పటికీ, లోకేష్ మాత్రం చాలా సాఫ్ట్ గా స్పందించిన సంగతి తెలిసిందే. రూ. 10 కోట్లు ఖర్చు పెట్టి మరీ శ్రీరెడ్డితో తనను తిట్టించి, ఆ దృశ్యాలు పదే పదే తమకు అనుకూల మీడియాలో వచ్చేలా చేశారని పవన్ ఘాటు విమర్శలు చేయగా, లోకేష్ అందుకు తగ్గ స్థాయిలో దీటుగా స్పందించలేదు.

పవన్ పై తనకు గౌరవం ఉందని, ఆయన్ను కొందరు తప్పుదారి పట్టిస్తున్నారని మాత్రమే అన్నారు. ఇక పవన్ ను లోకేష్ గట్టిగా విమర్శించక పోవడానికి కారణాలను విశ్లేషిస్తున్న రాజకీయ పండితులు, భవిష్యత్తులో అవసరమైతే జనసేనతో పొత్తు పెట్టుకోవాల్సి వుంటుందని టీడీపీ భావిస్తున్నట్టు అంచనా వేస్తున్నారు. అందువల్లే లోకేష్ పెద్దగా విమర్శలు చేయడం లేదని భావిస్తున్నారు.
Pawan Kalyan
Nara Lokesh
Jana Sena
Telugudesam

More Telugu News