Tejas: గాల్లో వెళుతూ, గాల్లోని లక్ష్యాన్ని ఛేదించిన తేజాస్!

  • మరో పరీక్షలో విజయం సాధించిన తేజాస్
  • కంటికి కనిపించని లక్ష్యాన్ని ఛేదించిన క్షిపణి
  • డెర్బీ మిసైల్ ను ప్రయోగించామన్న అధికారులు

దేశవాళీ యుద్ధ విమానం తేజాస్, మరో పరీక్షలో విజయం సాధించింది. సూపర్ సానిక్ జెట్ గా, ఎల్సీఏ (లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్)గా తయారైన ఈ విమానం గాల్లో ప్రయాణిస్తూ, గాల్లోని లక్ష్యాన్ని ఛేదించింది. చివరి ఆపరేషనల్ క్లియరెన్స్ ఇచ్చే ముందు జరిగిన ఈ పరీక్షలో తేజాస్ విమానం విజయం సాధించడంపై అధికారులు హర్షం వ్యక్తం చేశారు.

కంటికి కనిపించనంత దూరంలో ఉన్న లక్ష్యాన్ని విమానం నుంచి ప్రయోగించిన క్షిపణి తాకిందని, ఆ సమయంలో వింగ్ కమాండర్ సిద్ధార్థ సింగ్, పైలట్ గా ఉన్నారని తెలిపారు. 118 కిలోల బరువున్న డెర్బీ మిసైల్ ను తేజాస్ నుంచి ఆయన ప్రయోగించారని, ఈ పరీక్ష గోవా తీరంలో జరిగిందని వెల్లడించారు. తేజాస్ విమానాలను వాయుసేనకు అందించే ముందు పలు రకాల పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

More Telugu News