నీతి, నిజాయతీతో సేవ చేస్తాడని ఆశిస్తున్నా: కుమారుడి గురించి జేడీ లక్ష్మినారాయణ
- సివిల్స్ లో సత్తా చాటిన లక్ష్మీనారాయణ కుమారుడు
- 196వ ర్యాంకును కైవసం చేసుకున్న సాయి ప్రణీత్
- సేవా ధృక్పథంతో పని చేయాలని కుమారుడికి లక్ష్మీనారాయణ సూచన
మరోవైపు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, తన కుమారుడు సాధించిన విజయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. నిజాయతీతో, ప్రజలకు నిస్వార్థంగా సేవలందిస్తాడని ఆశిస్తున్నానని చెప్పారు. తనకు అందుబాటులో ఉన్న వనరులన్నింటినీ ఉపయోగించుకుని... సివిల్స్ పరీక్షల్లో ప్రణీత్ విజయం సాధించాడని తెలిపారు. సేవా ధృక్పథంతో పని చేయాలని ప్రణీత్ కు సూచిస్తున్నానని చెప్పారు.