manchu lakshmi: మంచు లక్ష్మి ప్రధాన పాత్రగా 'W/0 రామ్' .. టీజర్ రిలీజ్

  • మర్డర్ మిస్టరీగా 'W/0 రామ్'
  • దర్శకుడిగా విజయ్ యలకంటి
  • ముఖ్య పాత్రల్లో ప్రియదర్శి .. ఆదర్శ్ బాలకృష్ణ

మొదటి నుంచి కూడా మంచు లక్ష్మి విభిన్నమైన పాత్రలను చేస్తూ వస్తోంది. నటనకు ప్రాధాన్యత కలిగిన పాత్రలను పోషిస్తూ శభాష్ అనిపించుకుంటోంది. ఆమె తాజా చిత్రంగా ''W/0 రామ్' రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు.

'రామ్ ను పై నుంచి తోసి చంపేశాడు సార్' అనే డైలాగ్ తో ఈ టీజర్ మొదలవుతోంది. ప్రధాన పాత్రలపై కట్ చేసిన ఈ టీజర్ చూస్తుంటే, ఇది ఒక మర్డర్ మిస్టరీకి సంబంధించిన కథ అని తెలుస్తోంది. ఆదర్శ్ బాలకృష్ణ .. ప్రియదర్శి ముఖ్యమైన పాత్రలను పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ .. మంచు ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకి, విజయ్ యలకంటి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. 

More Telugu News