sensex: వరుసగా రెండో రోజు.. లాభాలతో కళకళలాడిన మార్కెట్లు

  • లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
  • 256 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 75 పాయింట్లు ఎగబాకిన నిఫ్టీ

భారతీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాలను నమోదు చేశాయి. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల ప్రభావం ఉండటంతో ఇన్వెస్టర్లు ఉత్సాహంగా ట్రేడింగ్ చేశారు. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 256 పాయింట్లు పెరిగి 34,970కి చేరుకుంది. ఒకానొక సమయంలో సెన్సెక్స్ 35 వేల మార్కును దాటి 35,023 వద్ద కూడా ట్రేడ్ అయింది. మరోవైపు, నిఫ్టీ 75 పాయింట్లు లాభపడి 10,692కి చేరుకుంది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
యాక్సిస్ బ్యాంక్ (8.97%), ఆంధ్ర బ్యాంక్ (7.34%), ఓరియంటల్ బ్యాంక్ (6.30%), అతుల్ లిమిటెడ్ (6.09%), యునైటెడ్ బ్రూవరీస్ (5.70%).    
 
టాప్ లూజర్స్:
పీసీ జువెలర్స్ (-24.94%), రిలయన్స్ నేవల్ అండ్ ఇంజినీరింగ్ లిమిటెడ్ (-7.22%), వీడియోకాన్ ఇండస్ట్రీస్ (-7.02%), ర్యాలీస్ ఇండియా (-6.36%), ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ (-6.21%).     

More Telugu News