chaitu: అమెరికా వెళుతోన్న చైతూ .. ముగింపు దిశగా 'సవ్యసాచి'

షార్ట్స్‌లో చూడండి
చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య 'సవ్యసాచి' సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ చాలావరకూ పూర్తయింది. తదుపరి షెడ్యూల్ ను అమెరికాలో ప్లాన్ చేశారు. వచ్చేనెల 2వ తేదీ నుంచి 12వ తేదీ వరకూ అక్కడ చైతూ .. నిధీ అగర్వాల్ పై  ఓ పాటను .. కొన్ని సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

ఈ షెడ్యూల్ తో దాదాపు ఈ సినిమా టాకీపార్ట్ పూర్తయినట్టే. గతంలో నాగార్జున చేసిన సూపర్ హిట్ మూవీ 'అల్లరి అల్లుడు' నుంచి 'నిన్ను రోడ్డు మీద చూసినది లగాయితు .. ' పాటను రీమిక్స్ చేశారు. ఈ పాట యూత్ ను మళ్లీ ఓ ఊపు ఊపేస్తుందని చెబుతున్నారు. మాధవన్ .. భూమిక పాత్రలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు. త్వరలోనే టీజర్ ను వదలడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.   
Go Back to Shorts
chaitu
nidhi agarwal

More Telugu News