Andhra Pradesh: ఏపీపై ఏ క్షణమైనా సైబర్‌ ఎటాక్స్‌ ప్రమాదం: మంత్రి లోకేష్‌ సంచలన వ్యాఖ్యలు

  • ఏపీలో టెక్నాలజీ వినియోగం అధికం
  • ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశంలో కొందరు
  • సైబర్ సెక్యూరిటీ అపరేషన్స్ సెంటర్ ఏర్పాటు

ఏపీపై పెద్ద ఎత్తున సైబర్ దాడులు జరిగే అవకాశం ఉందని మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు విశాఖపట్నంలో జరుగుతున్న సైబర్ సెక్యూరిటీ సమ్మిట్ లో పాల్గొన్న ఆయన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం అత్యున్నత సాంకేతికతను వివిధ రంగాల్లో వినియోగిస్తున్నదని, వెబ్ సైట్లను హ్యాక్ చేయడం ద్వారా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో కొందరు ఉన్నారని లోకేష్ అన్నారు.

వీటిని నివారించేందుకు సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటరును ఏర్పాటు చేశామని లోకేష్ గుర్తు చేశారు. బ్యాంకుల నుంచి రుణాలను పొందే విషయంలో రైతులు ఇబ్బందులు పడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, వారికి క్రెడిట్ రేటింగ్ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని ఈ సందర్భంగా బ్యాంకులను లోకేష్ కోరారు. కాగా, ఈ సదస్సు సందర్భంగా ఏపీ సర్కారు, మాస్టర్ కార్డు మధ్య ఓ డీల్ కుదిరింది.

More Telugu News