Radhemaa: కొడుకు బావమరిది పెళ్లిలో రాధేమా వేసిన స్టెప్పులు... వీడియో వైరల్!

  • తనను తాను దేవతగా చెప్పుకునే రాధేమా
  • జైపూర్ లో వివాహానికి హాజరు
  • నృత్యాలు చేసిన రాధేమా 
తనకై తాను దైవ స్వరూపంగా చెప్పుకునే వివాదాస్పద మాత రాధేమా డ్యాన్సులు చేస్తున్న తాజా వీడియో ఒకటి బహిర్గతమైంది. తన కుమారుడి బావమరిది వివాహంలో రాధేమా నృత్యాలు చేశారు. జైపూర్ కు చెందిన వ్యాపారి ఎంఎం మిఠాయివాలా పేరిట రిటైల్ చైన్ స్వీట్స్ స్టోర్ లను నిర్వహిస్తున్న మన్మోహన్ గుప్తా మనవరాలితో కుమారుడి బావమరిదికి వివాహ నిశ్చితార్థం జరిగింది.

ఆ వేడుకకు అతిథిగా వచ్చిన రాధేమా చుట్టూ ఉన్నవారిని పారవశ్యంలో ముంచెత్తేలా నృత్యం చేశారు. ఎరుపు రంగు దుస్తులు, భారీగా ఆభరణాలు ధరించి స్టయిలిష్ లుక్ లో కనిపిస్తున్న ఆమె, లేచి డ్యాన్స్ చేయడం ప్రారంభించగానే, బంధుమిత్రులు, భక్తులు కూడా అదే పని చేశారు. ఈ వీడియోను తీసిన వారు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయగా అదిప్పుడు వైరల్ అవుతోంది.
Radhemaa
Jaipur
Video
You Tube
Viral
Dance
Marriage

More Telugu News