మెగా హీరో మూవీనుంచి ఫస్టు సైట్ రిలీజ్

- కరుణాకరన్ దర్శకత్వంలో తేజు
- కథానాయికగా అనుపమ పరమేశ్వరన్
- ఈ నెల 28వ తేదీన ఫస్టులుక్
పోస్టర్లో అంతర్లీనంగా కథానాయికను కూడా ఆవిష్కరించారు. ఇది సంగీత ప్రధానమైన ప్రేమకథా చిత్రమనే విషయాన్ని ఈ పోస్టర్ ద్వారా కరుణాకరన్ చెప్పాడు. ఈ నెల 28వ తేదీన ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నట్టు ఈ పోస్టర్ ద్వారానే ప్రకటించారు. కరుణాకరన్ ప్రేమకథల స్పెషలిస్ట్ కనుక, ఈ సినిమాపై యూత్ లో అంచనాలు పెరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.