amit shah: బీజేపీ నేతలను చేర్చుకోవద్దు.. జగన్ కు అమిత్ షా మెసేజ్?.. ఏపీలో మారిన రాజకీయం

  • ఫోన్ కాల్ తో బీజేపీ వలసలను ఆపేసిన అమిత్ షా
  • పార్టీ మారడం ఆపేసి, ఆసుపత్రిలో చేరిన కన్నా
  • అమిత్ షా మెసేజ్ తో నిర్ణయం మార్చుకున్న జగన్
ఏపీ బీజేపీ నుంచి వైసీపీలోకి చేరికలకు ఆ పార్టీ హైకమాండ్ అడ్డుకట్ట వేసింది. ఈ నేపథ్యంలో, కన్నా లక్ష్మీనారాయణ వైసీపీలో చేరడం ఆగిపోయింది. అమిత్ షా చేసిన ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్ తో అంతా సెట్ అయిపోయిందని ప్రచారం జరుగుతోంది. కన్నా లక్ష్మీనారాయణకు ఢిల్లీ నుంచి ఫోన్ చేసిన అమిత్ షా... బీజేపీలోనే ఉండాలని కోరారు.

దీంతో, ఆయన మనసు మార్చుకున్నట్టు చెబుతున్నారు. దీంతో, వైసీపీలో చేరే కార్యక్రమాన్ని ఆపేసి, ఆసుపత్రిలో చేరారని అంటున్నారు. ఇదే సమయంలో వైసీపీ అధినేత జగన్ కు అమిత్ షా ఒక మెసేజ్ పెట్టారని సమాచారం. బీజేపీ నేతలెవరినీ వైసీపీలో చేర్చుకోవద్దని మెసేజ్ ద్వారా చెప్పారని తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 
amit shah
Jagan
kanna lakshminarayana

More Telugu News