బహిరంగంగానే వెళ్తాం కానీ, దొంగచాటుగా వెళ్లం: కొండా సురేఖ, కొండా మురళి
- జనాల్లో ఉండే నేతలమనే కేసీఆర్ టీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు
- పార్టీ మారుతున్నామనేది అసత్య ప్రచారం
- మా కూతురుకు కూడా టీఆర్ఎస్ టికెట్ వస్తుంది
వచ్చే ఎన్నికల్లో తమ కూతురు సుస్మితా పటేల్ కు కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ వస్తుందని... కొండా దంపతులు ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తల సంక్షేమం కోసం తమ సొంత డబ్బులతోనే వారికి కాంట్రాక్టు లైసెన్సులు ఇప్పించామని చెప్పారు. త్వరలోనే రూ. 32 కోట్ల పనులను కార్యకర్తలకు కేటాయించబోతున్నట్టు తెలిపారు. తమ వెంటే ఉంటూ కొంత మంది వెన్నుపోటు పొడుస్తున్నారని మండిపడ్డారు.