క్యాస్టింగ్ కౌచ్ అనేది అన్ని చోట్లా ఉంది..పార్లమెంటు కూడా అతీతం కాదు!: రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు
- క్యాస్టింగ్ కౌచ్ సినీ పరిశ్రమకే పరిమితంకాదు
- అన్ని చోట్లా ఉంది
- ఈ వ్యవహారంపై అందరూ కలసి పోరాడాలి
సినీ పరిశ్రమలో ఎవరినీ రేప్ చేసి వదిలేయడం లేదని... వాడుకుని వదిలేయడం లేదని... క్యాస్టింగ్ కౌచ్ వల్ల కొందరికి జీవనోపాధి లభిస్తోందని సరోజ్ ఖాన్ వ్యాఖ్యానించారు. ఆమె చేసిన వ్యాఖ్యలు పెను సంచలనాన్ని రేపాయి. ఆ తర్వాత సరోజ్ ఖాన్ తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. శ్రీరెడ్డి కూడా సరోజ్ ఖాన్ వ్యాఖ్యలను ఖండించారు.