posco: రేపిస్టులపై మెజారిటీ భారతీయుల అభిప్రాయం ఇదే!

  • ఉరిశిక్ష విధించాలంటున్న 76 శాతం మంది
  • పెరోల్ లేకుండా జీవితఖైదు విధించాలన్న 18 శాతం
  • సర్వేలో వెల్లడైన ప్రజాభిప్రాయం

బాలికలపై అత్యాచారం చేసే వారికి మరణశిక్షను విధించాలన్న ఆర్డినెన్స్ పై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సంతకం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆర్డినెన్సుకు సంబంధించి మెజారిటీ ఇండియన్స్ ఏమనుకుంటున్నారో ఓ సర్వే నివేదిక వెల్లడించింది. 76 శాతం మంది ప్రజలు రేపిస్టులకు ఉరి శిక్ష పడాల్సిందేనని చెప్పారు. జీవితఖైదు (పెరోల్ లేకుండా) విధించాలని 18 శాతం మంది తెలిపారు. మూడు శాతం మంది మాత్రం చిన్నారులపై అత్యాచారం చేసే వారికి ఏడేళ్ల జైలు శిక్షను విధించాలని అభిప్రాయపడ్డారు. 40వేల మందికి పైగా ప్రజలు ఈ సర్వేలో పాలుపంచుకున్నారు. 

More Telugu News