చంద్రబాబు సీరియస్.. వచ్చి కలవాలంటూ అఖిలప్రియ, ఏవీలకు ఆదేశం
- సైకిల్ ర్యాలీ సందర్భంగా ఏవీ సుబ్బారెడ్డిపై రాళ్ల దాడి
- ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఉద్రిక్తత
- పరిస్థితి మళ్లీ మొదటికి రావడంతో చంద్రబాబు సీరియస్
ఇటీవలే సింగపూర్ పర్యటన ముందు చంద్రబాబు వీళ్లిద్దరితో మాట్లాడారు. కలసి పని చేయాలని సూచించారు. ఇద్దరం కలసి సమన్వయంతో పని చేస్తామని ముఖ్యమంత్రికి చెప్పారు. అయినప్పటికీ, ఇద్దరి మధ్య మళ్లీ విభేదాలు రావడంపై సీఎం సీరియస్ అయ్యారు. మరోవైపు, అఖిలప్రియ మాట్లాడుతూ, ఎవరిపైనా దాడి చేయాల్సిన అవసరం తనకు లేదని చెప్పారు.