CHAHAL: త్వరలో పెళ్లిపీటలెక్కనున్న చాహల్?

  • కన్నడ నటి తనిష్కతో ప్రేమలో పడ్డ చాహల్
  • ఐపీఎల్ లో ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రికెటర్ 
  • వివిధ ఈవెంట్లకు హాజరైన ప్రేమజంట 

క్రికెట్-సినిమా రంగం సంబంధాలు అందరికీ తెలిసినవే. టైగర్ మన్సూర్ అలీఖాన్ పటౌడీ, షర్మిలా ఠాకూర్ ప్రేమజంటల నుంచి ఇటీవల విరాట్ కోహ్లీ-అనుష్క వరకు చాలా జంటలు ఇలానే ఒక్కటయ్యాయి. హర్భజన్- గీతాబస్రా, యువరాజ్ సింగ్-హజెల్ కీచ్, జహీర్‌ ఖాన్-సాగరికా ఘట్గేల జాబితాలో తాజాగా టీమిండియా క్రికెటర్ యజువేంద్ర చాహల్ కూడా చేరనున్నాడు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న చాహల్ కన్నడ నటి తనిష్కా కపూర్ తో ప్రేమలో పడ్డాడని సోషల్ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. వీరిద్దరూ జంటగా దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో వీరిద్దరూ పలు ఈవెంట్లకు హాజరైనట్టు తెలుస్తోంది. ఈ సీజన్ ముగియగానే వీరి వివాహం ఉంటుందని తెలుస్తోంది.

తనిష్క సోషల్ మీడియా పోస్టులకు చాహల్ కచ్చితంగా లైక్ కొడుతుండడంతో ఈ వార్తలు నిజమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే వారి వివాహంపై వారి నుంచి కానీ, వారి కుటుంబ సభ్యుల నుంచి కానీ ఎలాంటి ప్రకటన రాకపోవడం విశేషం. 

More Telugu News