old woman: ప్రపంచంలోనే వృద్ధమహిళ జపాన్ లో కన్నుమూత

  • 117 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచిన నబి తజీమా
  • ఈమె వయసుపై గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సైతం అధ్యయనం
  • జపాన్ లో సెంచరీ దాటిన వారు 67,824 మంది

జపాన్ కు చెందిన 117 ఏళ్ల వయసున్న వృద్ధురాలు కన్నుమూశారు. ఈ ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు ఈమేనని అంచనా. నబి తజీమా 1900 సంవత్సరంలో జన్మించారు. నైరుతి ప్రాంతంలోని కికైజిమాలో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె నిన్న తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు క్యోడో న్యూస్ ఏజెన్సీ కథనాన్ని ప్రచురించింది.

జమైకాకు చెందిన వైలట్ బ్రౌన్ 117 ఏళ్ల వయసులో మరణించిన తర్వాత గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ, జీవించి ఉన్న అత్యంత వృద్ధ మహిళగా తజీమాను గుర్తించేందుకు ఓ అధ్యయనం కూాడా నిర్వహించడం గమనార్హం. ఈ సంస్థ లోగడ జపాన్ కే చెందిన 112 ఏళ్ల మసాజో నోనక అనే పురుషుడ్ని ప్రపంచంలోనే అతిపెద్ద వయసున్న వ్యక్తిగా గుర్తించింది. సెంచరీ వయసు దాటిన వారు జపాన్ లో 2017 నాటికి 67,824 మంది జీవించి ఉన్నట్టు అక్కడి ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఈ ప్రపంచంలో సగటు జీవన కాలం ఎక్కువగా ఉన్న దేశాల్లో జపాన్ ముందుంటుంది.

More Telugu News