Prime Minister: ప్రపంచ మేధావులు అందరూ కలసి ప్రధాని మోదీకి లేఖ రాసిన వేళ

  • కథువా, ఉన్నావో ఘటనలపై ఆవేదన
  • ప్రధాని సరిగా స్పందించలేదని అభిప్రాయం
  • లేఖపై 600 మంది సంతకాలు

ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 600 మంది విద్యావేత్తలు, స్కాలర్లు ప్రధాని మోదీకి లేఖ రాసిన అరుదైన ఘటన చోటు చేసుకుంది. జమ్మూ కశ్మీర్ లోని కథువా, ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావోలో చిన్నారి బాలికలపై దారుణ అత్యాచారాలు జరగడం పట్ల వారు లేఖ రూపంలో తమ ఆవేదన తెలియజేశారు. ఈ ఘటనలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో చాలా రోజుల పాటు ప్రధాని మౌనంగా ఉండడం, చివరికి ప్రకటన చేసినప్పటికీ న్యాయం విషయంలో కచ్చితమైన హామీ ఇవ్వకపోవడంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు.

కథువా, ఉన్నావో దారుణ ఘటనలు, వాటి తర్వాత చోటు చేసుకున్న పరిణామాల పట్ల తాము తీవ్ర ఆగ్రహం, బాధను వ్యక్తం చేస్తున్నామని వారు లేఖలో తెలిపారు. న్యూయార్క్ యూనివర్సిటీ, బ్రౌన్ యూనివర్సిటీ, హార్వార్డ్ యూనివర్సిటీ, కొలంబియా యూనివర్సిటీతోపాటు ఐఐటీలు, ఇతర విద్యా సంస్థలకు చెందిన విద్యావేత్తలు, పరిశోధక విద్యార్థులు ప్రధానికి రాసిన లేఖపై సంతకాలు చేశారు. బాధ్యతగా భావించి ఈ లేఖ పంపుతున్నట్టు పేర్కొన్నారు.

More Telugu News