Iliayana: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • ప్రెగ్నెన్సీ వార్తలను ఖండించిన ఇలియానా
  • శర్వానంద్ కోసం హైదరాబాదులో సెట్
  • స్పెయిన్ లో హాలిడే ఎంజాయ్ చేస్తున్న తాప్సీ  

*  గత కొంత కాలంగా తన ఆస్ట్రేలియన్ బాయ్ ఫ్రెండ్ ఆండ్రూ నీబోన్ తో కలసి ఉంటున్న కథానాయిక ఇలియానా, త్వరలో తల్లి కాబోతోందంటూ ఇటీవల మీడియాలో వార్తలొచ్చాయి. అయితే ఇందులో వాస్తవం లేదంటూ ఈ ముద్దుగుమ్మ తాజాగా 'నాట్ ప్రెగ్నెంట్' అంటూ ట్వీట్ చేసింది. ఆ విధంగా ఆ పుకార్లకు అమ్మడు చెక్ పెట్టింది
*  శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం కోసం హైదరాబాదులో ఓ సెట్ వేస్తున్నారు. రెండో షెడ్యూలు షూటింగును త్వరలో ఈ సెట్స్ లో నిర్వహిస్తారు. శర్వ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, కల్యాణి ప్రియదర్శిన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
*  ప్రస్తుతం తెలుగులో ఓ చిత్రాన్ని, హిందీలో మరో చిత్రాన్ని చేస్తున్న సొట్టబుగ్గల చిన్నది తాప్సీ ఇప్పుడు హాలిడే కోసం బ్రేక్ తీసుకుంది. తన చెల్లి శాగున్ తో కలసి స్పెయిన్ లో హాలిడేను ఎంజాయ్ చేస్తోంది.    

More Telugu News