KTR: నవ్వులు పూయిస్తోన్న కేటీఆర్‌ ట్వీట్‌!

  • ఉచితంగా 3 ఐపీఎల్‌ టిక్కెట్లు కావాలన్న నెటిజన్‌
  • ‘నా వల్ల కాదు బాబూ’ అంటూ కేటీఆర్‌ ట్వీట్‌
  • దండం పెడుతున్నట్లు ఎమోజీ
ప్రత్యర్థులకు చురకలంటిస్తూ విరుచుకు పడాలన్నా, ఎవరినయినా ప్రశంసించాలన్నా తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ను బాగానే ఉపయోగిస్తుంటారు. అలాగే, తమకు సాయం చేయాలని ఎవరయినా ట్విట్టర్‌ ద్వారా కోరినా, ఏదైనా విషయంపై ఫిర్యాదు చేసినా వెంటనే రిప్లై ఇచ్చి సమస్యకు పరిష్కారం చూపుతుంటారు.

కాగా, తాజాగా ఆయన చేసిన ఓ ట్వీటు నవ్వులు పూయిస్తోంది. ఓ క్రికెట్‌ అభిమాని తనకు ఉచితంగా 3 ఐపీఎల్‌ టిక్కెట్లు కావాలంటూ కేటీఆర్‌కు సరదాగా ట్వీట్‌ చేశాడు. దానిపై కూడా స్పందించిన కేటీఆర్‌.. ‘నా వల్ల కాదు బాబూ..’ అంటూ దండం పెడుతున్నట్లు ఓ ఎమోజీ గుర్తును పోస్ట్‌ చేశారు.
KTR
Twitter
Telangana

More Telugu News