jabardasth mahesh: 'మహానటి'లో తన పాత్ర గురించి జబర్దస్త్ మహేశ్

  • 'జబర్దస్త్'తో మహేశ్ కి మంచి పేరు 
  • నితిన్ మూవీలోనూ వెరైటీ పాత్ర
  • శర్వానంద్ సినిమాలోను ఛాన్స్
'జబర్దస్త్' వేదిక మీద నుంచి వెండితెర వైపు వచ్చిన హాస్యనటుల్లో మహేశ్ ఒకరు. 'శతమానం భవతి' సినిమాతో తెరపై సందడి చేసిన ఆయన, 'రంగస్థలం' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఫిల్మీ ఫోకస్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తన కెరియర్ కి సంబంధించిన విషయాలను పంచుకున్నాడు.

 "మహానటి సినిమాలోను నాది మంచి రోల్. 'రంగస్థలం' తరువాత నాకు బాగా నచ్చిన పాత్ర అది. ఆ పాత్రను గురించి నేను ఇప్పుడు చెప్పకూడదు .. అదేమిటనేది థియేటర్లో చూస్తేనే బాగుంటుంది. ఈ పాత్ర నాకు మరింత మంచి పేరు తెస్తుందనే నమ్మకమైతే వుంది. ప్రస్తుతం నితిన్ 'శ్రీనివాస కల్యాణం'తో పాటు, రామ్ .. శర్వానంద్ సినిమాల్లో కూడా చేస్తున్నాను" అని చెప్పుకొచ్చాడు.   
jabardasth mahesh

More Telugu News