Mahesh Babu: తొలి రోజునే చరణ్ రికార్డును అధిగమించిన మహేశ్!

  • నిన్ననే విడుదలైన 'భరత్ అనే నేను'
  • తెలుగు రాష్ట్రాల్లో వసూళ్ల జోరు 
  • అభిమానుల్లో పెరుగుతోన్న ఆనందం     
కొరటాల శివ .. మహేశ్ బాబు కాంబినేషన్లో రూపొందిన 'భరత్ అనే నేను' నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా, తొలి ఆటతోనే సక్సెస్ టాక్ తెచ్చుకుంది. తెలుగు రాష్ట్రాల్లోను .. ఓవర్సీస్ లోనే కాదు, చెన్నైలోను ఈ సినిమా తొలిరోజున భారీ వసూళ్లను రాబట్టింది. తొలి రోజునే తొలి రికార్డును చెన్నై నుంచే ఈ సినిమా మొదలుపెట్టింది.

చరణ్ కథానాయకుడిగా చేసిన 'రంగస్థలం' తొలి రోజున చెన్నైలో 25 లక్షల గ్రాస్ ను వసూలు చేసి మొదటిస్థానంలో నిలిచింది. నిన్న విడుదలైన 'భరత్ అనే నేను' తొలిరోజున చెన్నైలో 27 లక్షలకి పైగా గ్రాస్ ను వసూలు చేసి కొత్త రికార్డును సృష్టించింది. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా, మరిన్ని రికార్డులను సాధించే అవకాశం ఉందనే మాట ఫిల్మ్ నగర్లో జోరుగా వినిపిస్తోంది. రెండు పరాజయాల తరువాత మహేశ్ ఆశిస్తోన్న బ్లాక్ బస్టర్ పడటం ఆయన అభిమానులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది.       
Mahesh Babu
kiara advani

More Telugu News