Mahesh Babu: మహేశ్ మూవీ ప్రీమియర్ షో టాక్ .. ఆ సీన్ .. ఆ ఫైట్ అదుర్స్ అంటున్న ప్రేక్షకులు!

  • ఈ రోజునే థియేటర్లకు వచ్చిన 'భరత్ అనే నేను'
  • యూఎస్ నుంచి పాజిటివ్ టాక్ 
  • అభిమానుల సంతోషం    

మహేశ్ బాబు తాజా చిత్రంగా 'భరత్ అనే నేను' ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యూఎస్ ప్రీమియర్ షో టాక్ పాజిటివ్ గా ఉండటం అభిమానుల్లో ఆనందాన్ని రేకెత్తిస్తోంది. ప్రీమియర్ షో చూసినవాళ్లు ముందుగా మహేశ్ బాబు హ్యాండ్సమ్ లుక్ కి ఫస్టు మార్కులు ఇస్తున్నారు. లుక్స్ పరంగా ఆయన కెరియర్లో ఇది బెస్ట్ అని చెబుతున్నారు.

ఈ సినిమాలో హెలికాఫ్టర్ లో రాయలసీమకి చేరుకుని .. అక్కడ ఆయన జనంలోకి వెళ్లే సన్నివేశం రోమాలు నిక్కబొడుచుకునేలా ఉందని అంటున్నారు. ఇక 'దుర్గా మహల్' థియేటర్ లోని ఫైట్ సీన్ ఈ సినిమాలోనే కాదు, ఇంతకు ముందు మహేశ్ చేసిన అన్ని సినిమాల్లోని ఫైట్ సీన్స్ ను మించి ఉందని చెబుతున్నారు. ఆడియన్స్ రెప్ప వేయడం మరిచిపోయేలా ఈ ఫైట్ సీన్ ఉందని చెబుతున్నారు. ఈ సినిమా భారీ వసూళ్లను సాధించడం ఖాయమనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.   

More Telugu News