సొంత స్మార్ట్ ఫోన్ల విక్రయాల్లో చతికిలపడిన ఫ్లిప్ కార్ట్, అమేజాన్
- ఫ్లిప్ కార్ట్ నుంచి బిలియన్ క్యాప్చర్ బ్రాండ్ పై ఫోన్ల విక్రయాలు
- అమేజాన్ నుంచి టెనార్ బ్రాండ్ పేరుతో ఫోన్లు
- విక్రయాల్లో టెనార్ కాస్త మెరుగు
- అయినా మొత్తం విక్రయాల్లో వీటి వాటా చాలా స్వల్పం
ఒక్క డిసెంబర్ మాసంలోనే ఫ్లిప్ కార్ట్, అమేజాన్ తమ ప్లాట్ ఫామ్ లపై వివిధ రకాల బ్రాండ్లకు చెందిన సుమారు 15 లక్షల ఫోన్ల విక్రయాలను నమోదు చేశాయి. కానీ, సొంత బ్రాండ్ల విక్రయాలు మాత్రం వీటిలో చెప్పుకోతగ్గ స్థాయిలో లేవు. దీంతో కస్టమర్ల ఆదరణ చూరగొనడంలో వైఫల్యం చెందినట్టు తెలుస్తోంది.
ఫ్లిప్ కార్ట్ కేవలం 20,000 ఫోన్లనే విక్రయించగా, అమేజాన్ టెనార్ మాత్రం దీని కంటే మెరుగ్గా ఉంది. 2,50,000 ఫోన్లను అమ్ముకుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఫ్లిప్ కార్ట్ తన వ్యూహాలను మార్చుకునే పనిలో పడింది. మరోవైపు దేశీయంగా షియోమీ, శామ్ సంగ్ గరిష్ట మార్కెట్ వాటాతో బలమైన కంపెనీలుగా ఉన్నాయి.