charan: రాజకీయ నేపథ్యంలో చరణ్ మూవీ .. విలన్ గా వివేక్ ఒబెరాయ్

  • బోయపాటి తాజా షెడ్యూల్ మొదలు 
  • షూటింగులో జాయినైన చరణ్ 
  • కథానాయికగా కైరా అద్వాని  

చరణ్ హీరోగా బోయపాటి కొంతకాలం క్రితమే ఒక సినిమాను మొదలుపెట్టాడు. చరణ్ బిజీగా ఉండటంతో ఆయన ప్రమేయం లేని సన్నివేశాలను ప్లాన్ చేసుకుని కొంత భాగం చిత్రీకరణ జరిపాడు. ఈ సినిమా తాజా షెడ్యూల్ నిన్న హైదరాబాద్ లో మొదలైంది. ప్రధాన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ఈ షెడ్యూల్లో చిత్రీకరించనున్నారు.

చరణ్ జోడీగా కైరా అద్వానీని తీసుకున్నారు. ఈ సినిమాలో రాజకీయ నాయకుడైన విలన్ గా వివేక్ ఒబెరాయ్ కనిపించనున్నాడు. రాజకీయ నేపథ్యంతో కూడిన డ్రామాతో ఈ సినిమా కొనసాగుతుందని తెలుస్తోంది. చరణ్ సినిమాల నుంచి అభిమానులు ఆశించే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉండేలా బోయపాటి శ్రద్ధ తీసుకున్నాడట. ఈ సినిమాలో చరణ్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నట్టు సమాచారం.    

More Telugu News