ram gopal varma: నీ సంగతి ఏమిటో తేలుస్తాం.. యుద్ధానికి రెడీగా ఉండు!: రామ్ గోపాల్ వర్మకు బన్నీ వాసు వార్నింగ్

  • నీ డ్రామా మొత్తం అర్థమైంది
  • మెగా ఫ్యాన్స్ ను ఇకపై కంట్రోల్ చేయబోం
  • మెగా ఫ్యామిలీ సపోర్టర్స్ అంతా ఈరోజు సమావేశం అవుతున్నాం
క్యాస్టింగ్ కౌచ్ పై చేస్తున్న పోరాటంలోకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను లాగమని హీరోయిన్ శ్రీరెడ్డికి చెప్పింది తానేనని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వర్మకు మెగా కాంపౌండ్ కు చెందిన నిర్మాత బన్నీ వాసు తీవ్ర హెచ్చరికలు జారీ చేశాడు.

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కూల్ గా ఉండాలని తాము ఎప్పుడూ కోరుతుంటామని... కానీ ఇప్పుడు నీవు ఆడిన డ్రామా మొత్తం తెలుసుకున్న తర్వాత ఇక ఫ్యాన్స్ ను ఆపే ప్రయత్నం చేయబోమని వాసు చెప్పాడు. తామంతా బయటకు వస్తున్నామని... యుద్ధానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించాడు. తమ సత్తా ఏంటో నీకు రుచి చూపిస్తామని అన్నాడు. మెగా ఫ్యామిలీ మద్దతుదారులంతా ఈ రోజు సమావేశం కాబోతున్నామని... సాయంత్రం తమ నిర్ణయం ఏమిటో ప్రకటిస్తామని చెప్పాడు.
ram gopal varma
bunny vasu
tollywood
mega fans

More Telugu News