sri reddy: వైసీపీ నన్ను వాడుకోవాలని చూసింది... కలకలం రేపుతున్న శ్రీరెడ్డి ఫోన్ సంభాషణ!

  • తోటి నటితో శ్రీరెడ్డి ఫోన్ సంభాషణ
  • వెలుగు చూసిన సంచలన విషయాలు
  • వైసీపీ నేతలు పెద్ద ప్లాన్ చేశారన్న శ్రీరెడ్డి
సినీ ఇండస్ట్రీలోని లైంగిక వేధింపులపై పోరాటం చేస్తున్న హీరోయిన్ శ్రీరెడ్డికి సంబంధించి ఓ ఫోన్ సంభాషణ ఇప్పుడు రాజకీయపరంగా కలకలం రేపుతోంది. తన స్నేహితురాలు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన తమన్నాతో ఆమె ఫోన్ లో మాట్లాడుతూ, సంచలన విషయాన్ని వెల్లడించింది.

వైసీపీ నేతలు పెద్ద ప్లాన్ వేశారని... పోరాటం చేస్తున్న తనను వాడుకోవాలని ప్రయత్నించారని... వీలైతే మరింతగా నన్ను ఈ వివాదంలో ఇరికిద్దామని యత్నించారని చెప్పింది. అయితే, తన ఏడుపు చూసి, కొంచెం వెనక్కి తగ్గారని తెలిపింది. ఇటీవలి కాలంలో శ్రీరెడ్డి చేస్తున్న ఘాటు వ్యాఖ్యల వెనక ఎవరో ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఫోన్ సంభాషణ కీలకంగా మారబోతోందని చెబుతున్నారు. 
sri reddy
YSRCP
Pawan Kalyan
ram gopal varma
5 crores

More Telugu News