Pooja: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • 'బోర్ కొట్టేస్తుంది' అంటున్న పూజ 
  • ప్రయోగాలు చేసేది లేదన్న మహేశ్
  • ఫైట్ చేస్తున్న 'శైలజా రెడ్డి గారి అల్లుడు'

*  రొటీన్ గా ఒకే పని చేయడం తన వల్ల కాదంటోంది అందాలభామ పూజా హెగ్డే. 'ప్రతి రోజూ కొత్తగా వుండాలని కోరుకుంటాను. అందుకే చేసిన పనే చేయడం అంటే నాకిష్టం వుండదు. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. అందుకే కొత్తగా వుండే పాత్రలనే ఒప్పుకుంటాను. రొటీన్ గా ఒకటే పని చేయమంటే మాత్రం నాకు బోర్ కొట్టేస్తుంది' అని చెప్పింది పూజ.
*  సినిమాల పరంగా ప్రయోగాలు చేసే ఉద్దేశం ఇక తనకు అసలు లేదని చెప్పాడు మహేశ్ బాబు. 'ప్రయోగాలు చేసే ఓపిక లేదు. అయినా సినిమాల పరంగా ఏవైనా ప్రయోగాలు చేసినా, నాన్నగారి అభిమానులు ఊరుకోరు. డైరెక్టుగా మా ఇంటికొచ్చి నా మీద ఎటాక్ చేసినా చేస్తారు' అంటూ చమత్కరించాడు.
*  నాగ చైతన్య హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న 'శైలజా రెడ్డి గారి అల్లుడు' చిత్రం షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది. ప్రస్తుతం చైతూ, కొంతమంది ఫైటర్లపై యాక్షన్ దృశ్యాలను చిత్రీకరిస్తున్నారు. ఇందులో అనూ ఇమ్మానుయేల్ కథానాయికగా నటిస్తోంది.

More Telugu News