Narendra Modi: బ్రిటన్ ప్రధాని థెరెసా మేతో మోదీ భేటీ.. విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగించాలని అభ్యర్థన!

  • బ్రిటన్ పర్యటనలో థెరెసా మేతో మోదీ భేటీ
  • ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చలు
  • చర్చల మధ్యలో విజయ్ మాల్యా ప్రస్తావన

బ్రిటన్‌లో పర్యటిస్తున్న భారత ప్రధాని నరేంద్రమోదీ ఆ దేశ ప్రధాని థెరెసా మేతో బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఉన్న పరస్పర సహకారం గురించి ప్రస్తావించారు. సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా చర్చలు జరిగాయి. చర్యల మధ్యలో భారత బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగవేసి లండన్‌లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యా ప్రస్తావన వచ్చినట్టు సమాచారం. మాల్యాను భారత్‌కు తిరిగి అప్పగించాల్సిందిగా థెరెసా మేను మోదీ కోరినట్టు తెలుస్తోంది. అయితే, ఆమె స్పందన ఏంటన్నది మాత్రం తెలియరాలేదు.

దేశంలోని బ్యాంకులకు రూ.9 వేల కోట్ల రుణాలు ఎగవేసిన మాల్యా లండన్‌లో తలదాచుకున్నాడు. అతడిని భారత్‌కు రప్పించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో మాల్యా విషయాన్ని అక్కడి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా అక్కడి పోలీసులు రెండుసార్లు మాల్యాను అరెస్ట్ చేశారు. అయితే, ఆ వెంటనే ఆయన బెయిలుపై విడుదలయ్యాడు. ప్రస్తుతం మాల్యాపై అక్కడ విచారణ కొనసాగుతోంది.

More Telugu News