elections: జమిలి ఎన్నికలకు ఓకే అంటోన్న అధిక శాతం ప్రజలు!

  • లోకల్‌ సర్కిల్స్‌ సంస్థ సర్వే
  • 84 శాతం మంది జమిలి ఎన్నికలకు సానుకూలం
  • 13 శాతం మంది నో చెప్పిన వైనం 

భారత్‌లో జమిలి ఎన్నికలు నిర్వహించాలన్న యోచనపై అధిక శాతం మంది ప్రజలు సానుకూలంగా ఉన్నారని లోకల్‌ సర్కిల్స్‌ అనే సంస్థ నిర్వహించిన ఆన్‌లైన్‌ సర్వేలో తేలింది. సర్వేలో పాల్గొన్న 84 శాతం మంది జమిలి ఎన్నికలకు ఓకే అని సమాధానం ఇవ్వగా, 13 శాతం మంది మాత్రం నో చెప్పారు. మిగతా మూడు శాతం ప్రజలు ఏమీ చెప్పలేమని అన్నారు.

లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే సమయం, వ్యయం ఆదా అవుతాయని, అంతేగాక అభివృద్ధి, పాలనపై ‍ప్రభుత్వాలు దృష్టిసారించేందుకు వెసులుబాటు ఉంటుందని 93 శాతం మంది అభిప్రాయపడ్డారు. మరోవైపు, కొందరు పలు సందేహాలు వ్యక్తం చేశారు. సమర్థవంతంగా ప్రచారం చేసుకునే పార్టీ దేశవ్యాప్తంగా ఏకకాలంలో ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని కూడా అన్నారు.

కాగా, 2019 నుంచి రెండు దశల్లో జమిలి ఎన్నికలను నిర్వహించవచ్చని గతంలో లా కమిషన్‌ ప్రతిపాదించిన విషయం విదితమే. 

More Telugu News