Tamilnadu: నా మనవరాలిగా భావించే అలా చేశాను: తమిళనాడు గవర్నర్ క్షమాపణ

  • మహిళా జర్నలిస్టు చెంపను నిమిరిన గవర్నర్  
  • నేను కూడా 40 ఏళ్ల పాటు పాత్రికేయ వృత్తిలో ఉన్నాను
  • ప్రశంసాపూర్వకంగానే అలా తాకానన్న గవర్నర్ 

మధురై కామరాజ్‌ విశ్వవిద్యాలయ అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలాదేవితో తనకు సంబంధం ఉన్నట్లు వచ్చిన ఆరోపణలను ఖండించేందుకు నిన్న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహిళా జర్నలిస్టు పట్ల తాను అభ్యంతరకరంగా ప్రవర్తించినందుకు తమిళనాడు గవర్నర్‌ బన్వరీలాల్‌ పురోహిత్‌ క్షమాపణలు చెప్పారు.

మహిళా జర్నలిస్ట్‌ లక్ష్మీ సుబ్రమణియన్‌ చెంప తాకడంపై వివరణ ఇస్తూ, ‘మీరు మంచి ప్రశ్న అడిగారు, అందుకే ప్రశంసాపూర్వకంగా చెంపపై తాకాను. నిన్ను నా మనవరాలిగా అనుకున్నాను. విలేకరిగా మంచి ప్రతిభ చూపించినందుకు ప్రశంసిస్తున్నట్టుగానే అలా చేశాను. నేను కూడా 40 ఏళ్ల పాటు పాత్రికేయ వృత్తిలో ఉన్నాను’ అన్నారు గవర్నర్. అనంతరం ఆయన క్షమాపణలను అంగీకరిస్తున్నానని లక్ష్మీ సుబ్రమణియన్‌ తెలిపారు. అయితే తానడిగిన ప్రశ్నలకు ప్రశంసాపూర్వకంగా తాకారనడాన్ని మాత్రం అంగీకరించలేకపోతున్నానని ఆమె చెప్పారు.

More Telugu News