kambham pati hari babu: బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కంభంపాటి నియామకం

  • ఈ మేరకు అమిత్ షా ఆదేశాలు
  • ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడ్ని ఈరోజు నియమించే అవకాశాలు
  • కాపు సామాజిక వర్గానికే ఛాన్స్? 
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కంభంపాటి హరిబాబును పార్టీ అధిష్ఠానం నియమించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి కంభంపాటి హరిబాబు ఇటీవల రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో ఏపీలో బీజేపీ అధ్యక్ష పదవికి ముఖ్యంగా నలుగురి పేర్లు తెరపైకి వచ్చాయి.

సోము వీర్రాజు, మాణిక్యాలరావు, కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరి ఆ జాబితాలో ఉన్నాయి. ఈ నాలుగు పేర్లతో పాటు ఆకుల సత్యనారాయణ పేరు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే ఈ పదవి దక్కనున్నట్టు తెలుస్తోంది. ఈరోజు సాయంత్రానికి ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడిని నియమించే అవకాశం ఉందని సమాచారం.
kambham pati hari babu
BJP

More Telugu News