Gujarath: సూరత్ లో బలైన చిన్నారి.. మార్కాపురం బాలికా?

  • ఏప్రిల్ 6న దారుణ హత్యాచారానికి గురైన బాలిక
  • బాలికను గుర్తించేందుకు పోలీసుల ప్రయత్నం
  • అదృశ్యమైన 8 వేల మంది బాలికల ఫొటోల పరిశీలన

గుజరాత్‌ లోని సూరత్‌ లో అమానవీయ పరిస్థితుల్లో హత్యాచారానికి గురైన చిన్నారిని ప్రకాశం జిల్లా మార్కాపురంకి చెందిన బాలికగా పోలీసులు అనుమానిస్తున్నారు. మార్కాపురం బాలికల వసతిగృహం నుంచి గత ఏడాది అక్టోబరు 11న మాకం చిన్ని (12) అదృశ్యమైంది. ఏప్రిల్ 6న సూరత్ లో దారుణంగా అత్యాచారానికి, హత్యకు గురైన బాలికను గుర్తించేందుకు గుజరాత్ పోలీసులు దేశవ్యాప్తంగా అదృశ్యమైన సుమారు ఎనిమిది వేల మంది బాలికల ఫొటోలను పరిశీలించగా, బాలిక పోలికలు ‘చిన్ని’ ఫొటోతో జతకలిశాయి. దీంతో వారు మార్కాపురం పోలీసులకు సమాచారమిచ్చారు.

వెంటనే మార్కాపురం పోలీసులు చిన్ని తల్లిదండ్రులను తీసుకుని సూరత్ వెళ్లారు. అక్కడ బాలిక మృతదేహాన్ని పరిశీలించిన తల్లిదండ్రులు చిన్నిదిగానే భావించారు. అయితే ఆధార్ కార్డులోని వేలిముద్రలు, పుట్టుమచ్చలతో మృతురాలి ఆనవాళ్లను పోల్చి చూడగా అవి సరిపోలలేదు. దీంతో పోలీసులు మృతురాలు చిన్ని కాదనే ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయినప్పటికీ చిన్ని తల్లిదండ్రుల డీఎన్‌ఏతో సరిపోల్చి చూడాలని అక్కడి అధికారులు నిర్ణయించారు. ఈ పరీక్షల అనంతరం మృతురాలు చిన్ని ఔనా? కాదా? అన్న స్పష్టమైన నిర్ధారణకు రానున్నట్టు తెలుస్తోంది.

More Telugu News