No Cash: తెలుగు రాష్ట్రాల్లో నగదు కొరత... కారణం చెప్పిన బ్యాంకు ఉన్నతాధికారులు!

  • అత్యధిక ఏటీఎంలలో నో క్యాష్ బోర్డులు
  • నగదు లేక ప్రజల తీవ్ర అవస్థలు
  • బ్యాంకుల్లో సైతం కరెన్సీ కొరత
  • సెలవుల వల్ల ఇబ్బందన్న అధికారులు

హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, వరంగల్... ఏ నగరంలో చూసినా అత్యధిక ఏటీఎంలలో 'నో క్యాష్' బోర్డులు వెక్కిరిస్తున్నాయి. డబ్బులున్న ఒకటి రెండు ఏటీఎంల ముందు క్యూలైన్లు పెరిగిపోతుండగా, 2016 నవంబర్ లో నోట్ల రద్దు తరువాతి పరిస్థితి కనిపిస్తోంది. ఏటీఎంలలో నగదు లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతూ, బ్యాంకులకు వెళుతుంటే, అక్కడ సైతం అడిగినంత డబ్బు ఇవ్వకుండా కోత విధిస్తున్నారు.

క్యాష్ కష్టాలపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తుండగా, ఇటీవలి కాలంలో వరుస సెలవులు రావడంతోనే ఈ ఇబ్బంది కలిగిందని బ్యాంకుల ఉన్నతాధికారులు చెబుతున్నారు. మరోవైపు రూ. 2 వేల నోట్లు తిరిగి డిపాజిట్ కావడం లేదని చెబుతున్నారు. రద్దయిన నోట్ల స్థానంలో 80 శాతం కరెన్సీని కొత్త నోట్ల రూపంలో విడుదల చేసినప్పటికీ, అవి పూర్తి స్థాయిలో సర్క్యులేట్ కావడం లేదని వెల్లడించారు. తాము పక్క రాష్ట్రాల నుంచి కూడా డబ్బును తెప్పించి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రయత్నిస్తున్నామని, అతి త్వరలోనే ఏటీఎంలలో క్యాష్ నింపే ప్రయత్నం చేస్తామని తెలిపారు.

More Telugu News