కర్ణాటక ‘కాంగ్రెస్’ లో అసంతృప్తి.. టిక్కెట్లు దక్కని ఆశావహుల ఆందోళన!
Mon, Apr 16, 2018, 09:46 PM

- టిక్కెట్లు లభించని అభ్యర్థుల నిరసన
- చెరుగుప్ప సిట్టింగ్ ఎమ్మెల్యేకు లభించని టిక్కెట్
- చిక్ మగళూరులోని కాంగ్రెస్ కార్యాలయంపై దాడి
చెరుగుప్ప సిట్టింగ్ ఎమ్మెల్యే నాగరాజ్ గౌడ్ కు టిక్కెట్టు లభించకపోవడంతో ఆయనకు మద్దతుగా 15 మంది కార్పొరేటర్లు రాజీనామాలు చేశారు. తమ నిరసన వ్యక్తం చేస్తూ రేపు చిరుగుప్ప బంద్ కు పిలుపు నిచ్చారు. చిక్ మగళూరుకు చెందిన మహిళా నేతకూ కాంగ్రెస్ టిక్కెట్టు లభించకపోవడంతో ఆమె అనుచరులూ మండిపడుతున్నారు. స్థానిక కాంగ్రెస్ కార్యాలయంపై దాడికి దిగారు. ఇంకా చెప్పాలంటే.. మాయకొండలో శివమూర్తి, అవేరిలో మనోహన్, కుణిగల్ లో రామస్వామి గౌడ, రాజాజీనగర్ లో ఓ మహిళా నేతకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు లభించలేదు. దీంతో, ఆయా నేతల అనుచరులు, మద్దతుదారులు ఆందోళన చేపట్టారు.