anil kapoor: అనిల్ కపూర్ ఇంట మొదలైన పెళ్లి సందడి!

  • అనిల్ కపూర్ ఇంట మోగనున్న పెళ్లి బాజాలు 
  • మే మొదటి వారంలో సోనమ్ కపూర్ పెళ్లి
  • బాయ్ ఫ్రెండ్ ఆనంద్ అహూజాతో వివాహం

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అనిల్‌ కపూర్‌ ఇంట పెళ్లి సందడి మొదలైంది. అనిల్ కపూర్ గారాలపట్టి, బాలీవుడ్ నటి సోనమ్‌ కపూర్‌ ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త ఆనంద్‌ అహూజాతో కొంతకాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరి వివాహం మే మొదటి వారంలో చేయాలని ఇరువైపుల కుటుంబాలు నిర్ణయించాయి. ఈ జంట తొలుత తమ వివాహం స్విట్జర్లాండ్‌ లో చేసుకోవాలని నిర్ణయించగా, కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు ముంబైలోనే చేసుకోనున్నారు.

 దీంతో వివాహ వేడుకకు ముందు నిర్వహించే సంగీత్ కోసం సోనమ్‌ సిద్ధమవుతోంది. సంగీత్ లో సోనమ్ వేసే స్టెప్పులను ప్రముఖ కొరియోగ్రాఫర్‌ ఫరా ఖాన్‌ కంపోజ్‌ చేస్తోంది. ఈ సందర్భంగా ఫరాతో కలిసి దిగిన ఫొటోలను సోనమ్ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. జుహులోని అనిల్‌ కపూర్‌ బంగ్లాలో సంగీత్‌ రిహార్సల్స్‌ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకలో సోనమ్‌, ఆనంద్‌ కుటుంబీకులు సందడి చేయనున్నారు. ముంబైలో వివాహానంతరం ఢిల్లీలో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు.

More Telugu News