సోనా వ్యథ విని కన్నీరు పెట్టిన శ్రీరెడ్డి, అపూర్వ, మహిళా సంఘం నేత సంధ్య!
- పెద్దల చేతుల్లో నలిగిపోతున్న మహిళా నటులు
- ఒక్కొక్కరుగా గళం విప్పుతున్న వైనం
- ట్రాన్స్ జెండర్ నని తెలిసీ బట్టలు విప్పించారని విలపించిన సోనా
వేషాల కోసం వెళ్లే అబ్బాయిల నుంచి డబ్బు తీసుకుంటారని, అదే ఆడవాళ్లు వెళితే డబ్బులు ఇవ్వడం ఎందుకు, కమిట్ మెంట్ కావాలని అడుగుతారని చెప్పింది. హైదరాబాద్, సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ వేదికగా, మహిళా నటులు, మహిళా సంఘాల ప్రతినిధులు బహిరంగ చర్చ జరుపగా, పలువురు జూనియర్ ఆర్టిస్టులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు వచ్చి తమ బాధలు చెప్పుకున్నారు. పగలు అమ్మా అంటూ, రాత్రి బొమ్మలా చూసి పక్కలోకి రమ్మంటున్న నిర్మాతలు, హీరోలు సహా అందరి పేర్లనూ సాక్ష్యాలతో సహా బయట పెడతామని హెచ్చరించారు. సినిమా ఇండస్ట్రీలో నెగ్గాలంటే, పడుకోవాలి లేదా పడుకోబెట్టాలి అని వారు వాపోయారు.