ఫౌంటెన్ పెన్నుని గన్నుగా చూపి.. విమానంలోని వారిని బెంబేలెత్తించిన ప్రయాణికుడు
- చాంగ్ షా నుంచి బీజింగ్ కు బయల్దేరిన ఎయిర్ చైనా విమానం
- ఫ్లైట్ అటెండెంట్ ను బందీగా చేసుకునే ప్రయత్నం
- జెంగ్డౌ విమానాశ్రయంలో ఎమర్జన్సీ ల్యాండింగ్
వెంటనే పైలట్లు సమాచారాన్ని ఉన్నతాధికారులకు వివరించారు. వారి సూచనల మేరకు ఫ్లైట్ ను అత్యవసరంగా జెంగ్జౌ విమానాశ్రయానికి మళ్లించి ల్యాండ్ చేశారు. వెంటనే అత్యవసర భద్రతా బలగాలు విమానాన్ని చుట్టుముట్టి, ప్రయాణికులను, విమాన సిబ్బందిని సురక్షితంగా దించేశారు. అనంతరం నిందితుడ్ని అదుపులోకి తీసుకుని, ప్రయాణికులను మరో విమానంలో పంపారు. ఈ ఘటన పూర్తి వివరాలు వెల్లడించేందుకు చైనా పౌరవిమానయాన శాఖ నిరాకరించింది.