Telangana: తెలంగాణలో ప్రైవేట్ యూనివర్శిటీల బిల్లును వ్యతిరేకిస్తున్నాం: ప్రొఫెసర్ చక్రధర్

  • వ్యతిరేక పోరాట కమిటీ పేరుతో ప్రతి జిల్లాకు, యూనివర్శిటీకు వెళ్తాం
  • ఓయూలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్ని చక్రధర్
  • తెలంగాణలో నారాయణ, శ్రీ చైతన్య కాలేజీలు మూసివేయాలి
  • తెలంగాణలో విద్య, భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారాయి: హరగోపాల్

తెలంగాణలో ప్రైవేట్ యూనివర్శిటీల బిల్లును వ్యతిరేకిస్తున్నామని, దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని ప్రొఫెసర్ చక్రధర్ అన్నారు. తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దీనికి ప్రొఫెసర్ చక్రధర్, హరగోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చక్రధర్ మాట్లాడుతూ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల వ్యతిరేక పోరాట కమిటీ పేరుతో ప్రతి జిల్లాకు, ప్రతి యూనివర్శిటీకి వెళ్తామని, ఈ నెలలోనే ఉస్మానియా యూనివర్శిటీలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు.

ఈ సందర్భంగా హరగోపాల్ మాట్లాడుతూ, తెలంగాణలో నారాయణ, శ్రీ చైతన్య కాలేజీలు మూసివేయాలని డిమాండ్ చేశారు. కేవలం కేసీఆర్ వల్లే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించలేదని, ఎందరో విద్యార్థుల త్యాగఫలితం ఉందని అన్నారు. తెలంగాణ పాలన చూస్తుంటే ఇందుకోసమేనా విద్యార్థులు ప్రాణ త్యాగాలు చేసిందనిపిస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో విద్య, భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారాయని హరగోపాల్ విమర్శించారు.

More Telugu News