shivaji: హోదా కోసం రాజకీయ నాయకులే సరిగ్గా పోరాడడం లేదు.. సినిమా వాళ్లు ఎలా వస్తారు?: హీరో శివాజీ

  • గట్టిగా పోరాడకపోతే హోదా వచ్చే పరిస్థితి లేదు
  • కేంద్ర ప్రభుత్వం ఏపీని మోసం చేసింది
  • ప్రజలే పోరాటానికి దిగాలి
గట్టిగా పోరాడకపోతే ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా వచ్చే పరిస్థితి లేదని హోదా సాధన సమితి నేత, సినీనటుడు శివాజీ అన్నారు. ఈ రోజు విశాఖపట్నంలో ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ జరిపిన ఓ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న శివాజీ మీడియాతో మాట్లాడుతూ, రాజకీయ నాయకులపై విమర్శలు చేశారు.

 ప్రత్యేక హోదా కోసం రాజకీయ నాయకులే పూర్తిస్థాయిలో పోరాటం చేయడం లేదని, ఇక సినిమా రంగానికి చెందిన వారు ఎలా ముందుకు వస్తారని ఆయన నిలదీశారు. ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ రైల్వేజోన్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందని, రాజకీయ నాయకులు సరిగ్గా పోరాడడం లేదని, ఇక వాళ్లను పక్కనబెట్టి ప్రజలే పోరాటానికి దిగాలని అన్నారు. 
shivaji
Special Category Status
Vizag

More Telugu News