Viral Videos: మహిళకు స్వయంగా చెప్పులు తొడిగిన ప్రధాని మోదీ.. వీడియో

  • ఛత్తీస్‌గఢ్‌లో  మోదీ పర్యటన
  • పలు పథకాల ప్రారంభం
  • చరణ్-పాదుకా పథకానికి శ్రీకారం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా బీజాపూర్‌ జిల్లా జాంగలాలో మోదీ.. ఆయుష్మాన్‌ భారత్‌ పథకం తొలి దశకు శ్రీకారం చుట్టి, ఆ ప్రాంతంలో ఇందుకోసం తొలి ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. అంతేగాక, పలు అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా చరణ్-పాదుకా పథకం కూడా ప్రారంభించి, ఓ గిరిజన మహిళకు పాదరక్షలు అందించారు. ఆ మహిళ వేదికపైకి రాగానే మోదీ స్వయంగా ఆమెకు చెప్పులు తొడిగారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

అనంతరం మోదీ మాట్లాడుతూ... యువత నక్సలిజం వైపునకు ఆకర్షితులు కావద్దని వ్యాఖ్యానించారు. ప్రజల హక్కుల గురించి ఆలోచించడం ప్రభుత్వ బాధ్యత అని, యువత ఆయుధాలు పట్టి జీవితాలను నాశం చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు.
Viral Videos
Narendra Modi
BJP

More Telugu News