Jammu And Kashmir: కథువా దారుణంపై స్పందించిన ఐక్యరాజ్య సమితి

  • ఇది భయానక ఘటన
  • ఈ దారుణానికి పాల్పడ్డ వారిని ఉరి తీయాలి
  • అటువంటి వారిని క్షమించకూడదు
  • మరోసారి ఇలాంటి ఘటనలు మరెక్కడా జరగకూడదు

జమ్ముకశ్మీర్‌లోని కథువా ప్రాంతంలో ఓ గుడిలో కొందరు మృగాళ్లు చిన్నారిపై అత్యాచారం చేసి గొంతునులిమి చంపేసిన ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఐక్యరాజ్య సమితి కూడా స్పందించి దీన్ని భయానక ఘటనగా అభివర్ణించింది. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఈ దారుణ ఘటనపై మాట్లాడుతూ... ఆ చిన్నారిపై ఇటువంటి దారుణానికి పాల్పడ్డ వారిని ఉరి తీయాలని భారత ప్రభుత్వాన్ని కోరారు. మీడియాలో వచ్చిన కథనాలు తనను కదిలించాయని, ఓ పసి ప్రాణాన్ని అతి భయంకరంగా హింసించి, హత్య చేశారని, అటువంటి వారిని క్షమించకూడదని అన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు మరెక్కడా జరగకూడదని తాను కోరుకుంటున్నానని అన్నారు.

More Telugu News