'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' విలువను పెంచిన రషీద్ ఖాన్

13-04-2018 Fri 19:38
  • 13 పరుగులిచ్చి, ఒక వికెట్ తీసిన రషీద్ 
  • 18 డాట్ బాల్స్ వేసిన మూడో ఆటగాడిగా రికార్డు 
  • 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' గా నిలిచిన రషీద్  

ఆఫ్ఘనిస్థాన్ స్పిన్ సంచలనం రషీద్ ఖాన్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' విలువను పెంచాడు. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఈ సన్ రైజర్స్ హైదరాబాదు ఆటగాడు నాలుగు ఓవర్లు వేసి ఒక వికెట్ తీసుకుని, కేవలం 13 పరుగులు ఇచ్చాడు. అంతే కాకుండా ఐపీఎల్ మ్యాచ్ లో 18 డాట్ బాల్స్ వేసిన మూడో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. దీంతో 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' గా నిలిచాడు.

అయితే, తనకు వచ్చిన ఆ అవార్డును అనారోగ్యంతో బాధపడుతున్న తన స్నేహితుడి కుమారుడికి అంకితం ఇచ్చాడు. ఆ అవార్డుకు వచ్చిన రివార్డును బాలుడి వైద్యానికి ఖర్చు చేస్తానని తెలిపాడు. దీంతో రషీద్ మంచి మనసు పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.