amezon: అమెజాన్‌లో స్మార్ట్‌ఫోన్‌లు తీసుకుని మోసం.. నలుగురు హైదరాబాదీల అరెస్ట్‌.. రూ.10 లక్షలు స్వాధీనం

  • ఆర్డర్‌ చేసిన ఫోన్లు తీసుకుని అందలేదంటోన్న నిందితులు
  • మళ్లీ ఫోన్లు పంపాలని అమెజాన్‌కు డిమాండ్లు
  • అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసిన అమెజాన్‌  
  • నిందితుల నుంచి 556 సిమ్‌కార్డులు, 42 సెల్‌ఫోన్లు స్వాధీనం

అమెజాన్‌ సంస్థను మోసం చేస్తోన్న నలుగురు వ్యక్తులను ఈ రోజు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆన్‌లైన్‌లో స్మార్ట్‌ఫోన్లను ఆర్డర్‌ చేసిన సదరు నిందితులు ఫోన్లు తీసుకుంటున్నారు. చివరకు తమకు ఆ స్మార్ట్‌ఫోన్లు రాలేదంటూ మళ్లీ ఫోన్లు పంపాలంటూ అమెజాన్‌ను కోరుతున్నారు. దీంతో అనుమానం వచ్చి అమెజాన్‌ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.10 లక్షలకు పైగా నగదు, 556 సిమ్‌కార్డులు, 42 సెల్‌ఫోన్లు, 2 ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు చాలా కాలంగా ఇటువంటి నేరాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది.   

More Telugu News