Uttar Pradesh: అత్యాచార అరోపణలపై బీజేపీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేసిన సీబీఐ

  • ఈ తెల్లవారుజామున అరెస్ట్
  • పోస్కో చట్టం కింద కేసు నమోదు
  • మొత్తం మూడు కేసులపై విచారణ

ఎట్టకేలకు ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎంపీ కుల్ దీప్ సింగ్ సెంగార్ ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఓ యువతిపై అత్యాచారం చేసిన ఆరోపణలపై విచారిస్తున్న సీబీఐ, ప్రాధమిక సాక్ష్యాలు ఉన్నాయని గుర్తించి, ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్టు ప్రకటించింది. గత సంవత్సరం జూన్ లో కుల్ దీప్ తనపై అత్యాచారం చేశారని ఓ యువతి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇంటి ముందు ఇటీవల ధర్నా నిర్వహించడం దేశవ్యాప్తంగా సంచలనమైన సంగతి తెలిసిందే. ఆపై విచారణ పేరిట ఆమె తండ్రిని పోలీసులు స్టేషన్ కు తీసుకెళ్లగా, అతను మరణించాడు.

పోలీసులే తన తండ్రిని కొట్టి చంపారని బాధితురాలు ఆరోపించగా, దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది. ప్రస్తుతం ఉన్నావోకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న మఖీ పోలీసు స్టేషన్ లో కుల్ దీప్ పై మూడు కేసులను రిజిస్టర్ చేసిన సీబీఐ, ఆయనపై పోస్కో చట్టంతో పాటు ఐపీసీలోని పలు సెక్షన్లను జోడించింది. ఈ తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో లక్నోలోని కుల్ దీప్ నివాసానికి వెళ్లిన అధికారులు, ఆయన్ను అరెస్ట్ చేస్తున్నట్టు తెలిపి తీసుకుని వెళ్లారు.

More Telugu News