pooja hegde: లైంగిక వేధింపులపై హీరోయిన్ పూజా హెగ్డే స్పందన!

  • వేధింపులకు గురైన వారు చెప్పే మాటలు బాధను కలిగిస్తాయి
  • లైంగిక వేధింపులపై గట్టి పోరాటం చేయాలి
  • అందరూ కలిసి పోరాడితేనే సమస్యకు పరిష్కారం లభిస్తుంది

తనకు ఇంతవరకు సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులు ఎదురుకాలేదని... కానీ, వాటిని ఎదుర్కొన్నవారు తమ అనుభవాలను చెబుతుంటే చాలా బాధ కలుగుతుందని హీరోయిన్ పూజా హెగ్డే తెలిపింది. ఈ రంగంలోకి అనేక కారణాలతో వస్తుంటారని... డబ్బు సంపాదన కోసం కొందరు, నటన మీద ఇష్టంతో మరికొందరు వస్తుంటారని... అలాంటివారిని వేధింపులకు గురి చేయడం దారుణమని చెప్పింది.

లైంగిక వేధింపులపై గట్టిగా పోరాటం చేయాలని... అయితే అందరూ కలసి పోరాడితేనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని తెలిపింది. ఇది ఏ ఒక్కరో చేసే పోరాటం కాదని అభిప్రాయపడింది. అందరూ కలసి పోరాడకపోతే... ఈ వేధింపులు కేవలం వార్తలకే పరిమితమవుతాయని చెప్పింది. 

  • Loading...

More Telugu News