charan: సుకుమార్ .. చరణ్ .. సమంతలకి నాగ్ ప్రశంసలు

  • సుకుమార్ చిత్రీకరణ చాలా బాగుంది 
  • 'చిట్టిబాబు'గా చరణ్ నటన అద్భుతం 
  • సమంత నటన గర్వపడేలా వుంది    
ఒక వైపున అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ .. మరో వైపున ఇండస్ట్రీ ప్రముఖులను ఆకట్టుకుంటూ 'రంగస్థలం' దూసుకుపోతోంది. ఈ సినిమా చూసిన పవన్ కల్యాణ్ .. మహేశ్ బాబు .. ఎన్టీఆర్ తదితరులు అద్భుతమంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సినిమా టీమ్ ను ఎంతగానో అభినందించారు. అలాంటి ప్రముఖుల జాబితాలో తాజాగా నాగార్జున కూడా చేరిపోయారు."రంగస్థలం' సినిమాను సుకుమార్ అద్భుతంగా చిత్రీకరించారు. పల్లెటూరి వాతావరణంలో కొన్నేళ్ల పాటు వెనక్కి తీసుకెళ్లి మూలాలను గుర్తుచేశారు. ఇక 'చిట్టిబాబు' పాత్రకి చరణ్ జీవం పోశాడు. ఆయన నటన అద్భుతంగా అనిపించింది. సమంత నటన కూడా గర్వపడేలా వుంది" అంటూ వాళ్లందరినీ ట్విట్టర్ ద్వారా నాగార్జున ప్రశంసించారు. అందుకు సమంత స్పందిస్తూ .. 'థ్యాంక్యూ  మామా' అంటూ రిప్లై ఇచ్చింది.   
charan
samantha

More Telugu News