ఈ మేలోనే అమెరికా నుంచి భారత్‌కు అత్యంత క్లిష్టమైన రక్షణ సాంకేతికత
- భారత్ మాకు అతిపెద్ద రక్షణ భాగస్వామి
- యూఎస్-ఇండియా బంధంతో ఇతర దేశాలకు గట్టి సంకేతాలు
- స్పష్టం చేసిన అమెరికా రాయబారి కెన్నెత్ జస్టర్
తిరువిదనంతైలో జరిగిన ‘డెఫ్ఎక్స్‌పో-18’లో భాగంగా నిర్వహించిన యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ సెమినార్‌లో తొలిరోజు ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. భారత్-అమెరికా బంధం ఇతర దేశాలకు గట్టి సంకేతాలు పంపుతుందన్నారు. భారత్‌ను అమెరికా అతిపెద్ద రక్షణ భాగస్వామిగా గుర్తిస్తోందని పేర్కొన్న కెన్నెత్, అమెరికా కాంగ్రెస్ భారత్‌కు మద్దతు తెలుపుతోందన్నారు.