bcci: ఆందోళనల ఎఫెక్ట్: ఐపీఎల్ మ్యాచ్ లు చెన్నై నుంచి తరలింపు?

  • తమిళుల ఆందోళనతో వేదిక మారుస్తున్న బీసీసీఐ
  • ఐపీఎల్ సీజన్-11 తదుపరి మ్యాచ్ ల తరలింపు
  • చెన్నైలో నిర్వహించాల్సిన మ్యాచ్ లు 7

కావేరీ వాటర్ మేనేజ్ మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గత కొంత కాలంగా తమిళులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఐపీఎల్ ను బహిష్కరించాలని సోషల్ మీడియా మాధ్యమంగా పలువురు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో చెపాక్ స్టేడియంలో నిర్వహించిన తొలి ఐపీఎల్ సీజన్-11 మ్యాచ్ లో డుప్లెసిస్, రవీంద్ర జడేజా తదిరులపై షూలు విసిరినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

దీంతో తమిళనాడులోని పరిస్థితులపై ఆ రాష్ట్ర క్రికెట్ బోర్డు, క్రికెటర్లతో సమీక్ష నిర్వహించిన బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుందని సమాచారం. ఐపీఎల్ సీజన్-11కు సంబంధించి చెన్నైలో నిర్వహించాల్సిన తదుపరి మ్యాచ్ లను వేరే చోటుకి తరలించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బీసీసీఐ-ఐపీఎల్ అత్యున్నత స్థాయి సమావేశం జరుగుతోంది. చెన్నైకు సరైన ప్రత్యామ్నాయ వేదికల కోసం చర్చ జరుగుతోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. 

More Telugu News