డ్యుయల్ రియర్ కెమెరాలతో శాంసంగ్ జే7 డ్యుయో వచ్చేస్తోంది...!

11-04-2018 Wed 12:29
  • 13+5 మెగా పిక్సల్ కాంబినేషన్ రియల్ కెమెరాలు
  • 5.5 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే
  • 4జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజీ
  • ఈ నెల్లోనే విడుదలకు అవకాశాలు
శామ్ సంగ్ గెలాక్సీ జే7 డ్యుయో పేరుతో వెనుకవైపు రెండు కెమెరాలతో త్వరలోనే మోడల్ విడుదల కానుంది. ఇందులో రెండు కెమెరాలు ఉండొచ్చన్న అంచనాలు గతంలోనే వెలుగు చూడగా అవి నిజమని ఇప్పుడు స్పష్టమైంది. కంపెనీ తన వెబ్ సైట్లో గెలాక్సీ జే7 డ్యుయో పేరుతో లిస్ట్ చేసింది. ఈ నెల 23న ఈ ఫోన్ ను విడుదల చేసే అవకాశాలున్నాయి. ధర ఇంకా ప్రకటించలేదు. అలాగే, ఆన్ లైన్ లో ఫ్లిప్ కార్ట్ లేదా అమెజాన్ వీటిలో ఎందులో విక్రయించేదీ ఇప్పటికైతే సమాచారం లేదు.

ఇందులోని ఫీచర్ల విషయానికొస్తే... డ్యుయల్ మైక్రో సిప్, ఆండ్రాయిడ్ ఓరియో 8.0, 5.5 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే, 1.6 గిగాహెర్జ్ ఎక్సినోస్ 7 అక్టాకోర్  ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, డ్యుయల్ రియర్ కెమెరా (13+5 మెగా పిక్సల్) ఎఫ్ 1.9 అపెర్చర్, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 32 జీబీ స్టోరేజీ తదితర సదుపాయాలు ఉండనున్నాయి. ఫీచర్లకు సంబంధించి కంపెనీ వెల్లడించిన వివరాలు కావివి. కంపెనీ ఉద్యోగులు తెలిపిన వివరాల ఆధారంగా బయటకు వచ్చిన సమాచారం మాత్రమే.